పట్టణంలోని తెనాలి జంక్షన్ హెచ్‌పీ పెట్రోల్ బంకు ఎదుట మంగళవారం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Feb 26 2014 3:49 AM | Updated on Aug 30 2018 3:56 PM
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : పట్టణంలోని తెనాలి జంక్షన్ హెచ్‌పీ పెట్రోల్ బంకు ఎదుట మంగళవారం రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండగొలను గ్రామానికి చెందిన సీహెచ్ నాగరాజు(48) కారులో గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళుతున్నాడు. మార్గం మధ్యలో హెచ్‌పీ పెట్రోల్ బంకు ఎదుట రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది క్షతగాత్రుడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుం డగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ప్రమాదంలో దెబ్బతిన్న కారును పట్టణ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


