నదీ ప్రాంతాల్లో శాశ్వత గట్లు | Permanent parts of the river banks | Sakshi
Sakshi News home page

నదీ ప్రాంతాల్లో శాశ్వత గట్లు

Nov 9 2013 2:06 AM | Updated on Sep 2 2017 12:25 AM

జిల్లాలో మూడు నదుల పరీవాహక ప్రాంతాల్లో భూసేకరణకు అధికారులు నిర్ణయించా రు. వరదల సమయంలో ముంపు పరిస్థితులు.

 

=తాండవ, వరాహ, శారద పరీవాహకంలో ఏర్పాటు
 =శాశ్వత నిర్మాణాలకు 645 ఎకరాలు గుర్తింపు
 =భవిష్యత్తులో ముంపు ముప్పు లేకుండా చర్యలు
 =ప్రభుత్వానికి అధికారుల నివేదిక

 
 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో మూడు నదుల పరీవాహక ప్రాంతాల్లో భూసేకరణకు అధికారులు నిర్ణయించా రు. వరదల సమయంలో ముంపు పరిస్థితులు తలెత్తకుండా వరదకట్టలు (శాశ్వత గట్లు) ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. భవిష్యత్తులో భారీ వర్షాలు పడి నా గండ్లు పడే అవకాశం లేకుండా శాశ్వ త ప్రాతిపదికన నిర్మాణాలకు అధికారులు రూ. 114 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు.

ఇందుకు నదులకు సమీపంలో ఉన్న 645 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను శుక్రవారం ప్రభుత్వానికి పంపారు. ఏటా భారీ వర్షాలప్పుడు జిల్లాలో వందలాది గ్రామాలు నీట మునుగుతున్నా యి. ప్రధానంగా శారద, వరాహ, తాం డవ నదులు ఉప్పొంగుతూ గ్రామాలను ముంచేస్తున్నాయి. వరదలకు మట్టి గట్లు కొట్టుకుపోతున్నాయి. అనేక చోట్ల గండ్లు పడుతున్నాయి.

వరదలప్పుడు గ్రామాల్లోకి నీరు రాకుండా గండ్లు పడిన చోట అధికారులు, గ్రామస్తులు ఇసుక బస్తా లు వేస్తూ అవస్థలు పడుతున్నారు. వర్షాలు తగ్గాక నీటి పారుదలశాఖ తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతోంది. ఇటీవల వర్షాలకు కూడా ఇదే దుస్థితి ఎదురైంది. ఈ పరి స్థితి నిరోధానికి శాశ్వత ప్రాతిపదికన వరదకట్టలు నిర్మించాలని అధికారులు నిర్ణయించా రు. పాయకరావుపేటలో శాశ్వత ప్రాతిపది కన 300 మీటర్ల పొడవున రక్షణ గోడ నిర్మిం చనున్నారు.
 
645 ఎకరాల భూసేకరణ

వరదకట్టమ నిర్మాణానికి అధికారులు భూసేకరణకు సిద్ధమవుతున్నారు. శారద, వరాహ, తాండవ నదుల పరీవాహక ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములు ఉన్నా యి. వాటిల్లో కొందరు సరుగుడు, ఇతర తోటలు వేశారు. వర్షాలప్పుడు నదుల నుంచి వరద నీరు పొంగిన సందర్భంలో ఈ తోటలు కారణంగా నీరు పాయలుగా విడిపోయి గ్రామాల్లోకి చేరుతోంది. వరద నీరు పోటెత్తుతుండడంతో మట్టి గట్టులకు గండ్లు పడుతున్నాయి.  

ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో భారీగా గట్లను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఎక్కడెక్కడ గండ్లు పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో శాశ్వత గట్లు నిర్మించేందుకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే కొట్టుకుపోతున్న ప్రాంతాల్లో పెద్ద గట్టుల నిర్మాణాలకు సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల స్థలాలను సేకరించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం ఈ మూడు నదుల పరిధిలో మొత్తం 645 ఎకరాల్లో భూసేకరణ చేపట్టాలని గుర్తించారు. ఇందుకు మరో రూ.14 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు.

ఈ విషయాన్ని అధికారులు ఇప్పటికే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ముందుగా భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయని, రెండో దశలో గట్లు నిర్మాణాలకు నిధులు మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే ముంపు పరిస్థితులను కొంత వరకు నిరోధించే అవకాశం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement