ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని విద్యా సంస్థలు చేపట్టిన ‘సమైక్య సమర శంఖారావం’లో ఆయన గజ్టెకట్టి సమైక్యాంధ్ర కోసం నేను సైతం...అంటూ గళమెత్తారు. ఈ మేరకు రాయగడ రోడ్డు, పాత బస్టాండ్ ప్రాంతంలో వాసవి-గాయత్రి విద్యా సంస్థల విద్యార్థుల వద్ద ఆయన ఆట- పాట ప్రారంభించారు
పార్వతీపురం టౌన్ (విజయనగరం), న్యూస్‌లైన్ : ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని విద్యా సంస్థలు చేపట్టిన ‘సమైక్య సమర శంఖారావం’లో ఆయన గజ్టెకట్టి సమైక్యాంధ్ర కోసం నేను సైతం...అంటూ గళమెత్తారు. ఈ మేరకు రాయగడ రోడ్డు, పాత బస్టాండ్ ప్రాంతంలో వాసవి-గాయత్రి విద్యా సంస్థల విద్యార్థుల వద్ద ఆయన ఆట- పాట ప్రారంభించారు. ప్రధాన రహదారిలో అలా ఆడుతూ...పాడుతూ మేదరవీధి జంక్షన్ వచ్చే సరికి గుండెలో నొప్పిగా ఉందంటూ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడున్న తోటి కళాకారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయన్ను సమీపంలోని సౌందర్య ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎండ తీవ్ర త వల్ల ఆయన అస్వస్థతకు గురైనట్టు ఆస్పత్రి వైద్యుడు సంకా ప్రతాప్ కుమార్ తెలిపారు