శ్రీవారి సన్నిధిలో ఇద్దరు పీఠాధిపతులు | peethadhipatulu at tirumala | Sakshi
Sakshi News home page

Dec 12 2017 7:16 PM | Updated on Dec 12 2017 7:16 PM

తిరుమల:కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కంచి పీఠాధిపతికి జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అలాగే కర్ణాటకాలోని ఉత్తరాది మఠం పీఠాధిపతి సత్యాత్మతీర్థ స్వామికి టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు ఇస్తికఫాల్‌ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. వారి వెంట పారుపత్తేదార్‌ రామచంద్ర, ఓఎస్‌డి డాలర్‌ శేషాద్రి, బొక్కసం ఇన్‌చార్జి గురురాజారావు ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement