ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు | Peddireddy Ramachandra Reddy Thanks For Giving Funds To Cm Relief Fund | Sakshi
Sakshi News home page

ఏపీ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

Apr 2 2020 5:21 PM | Updated on Apr 9 2020 5:52 PM

Peddireddy Ramachandra Reddy Thanks For Giving Funds To Cm Relief Fund - Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా నేపథ్యంలో సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి గ్రామ సచివాలయాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో పారిశుద్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇక నుంచి కూడా సీఎం సహాయ నిధికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరారు.

సీఎం సహాయనిధికి అందిన విరాళాలు..
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మైనింగ్‌ శాఖల విరాళం : రూ. 200.11 కోట్లు
ఏపీఎండీసీ విరాళం : రూ. 10.62 కోట్లు
మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ విరాళం : రూ. 56 లక్షలు
ఉపాధి హామీ, వాటర్‌షెడ్‌ శాఖ విరాళం : రూ. 1.50 కోట్లు
సెర్ఫ్‌ఉద్యోగుల విరాళం : రూ. 50 లక్షలు  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement