ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి | PCC Vice President Tulasi Reddy Comments on Chandrababu | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి

Feb 25 2016 2:59 AM | Updated on Jul 28 2018 3:23 PM

ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి - Sakshi

ఎన్టీఆర్‌కు, బాబుకు పోలికే లేదు: తులసిరెడ్డి

ఎన్టీఆర్, చంద్రబాబుకు పోలికే లేదని, వారి మధ్య సతీ సావిత్రికి, చింతామణికి ఉన్నంత తేడా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.

వేంపల్లె:  ఎన్టీఆర్, చంద్రబాబుకు పోలికే లేదని, వారి మధ్య సతీ సావిత్రికి, చింతామణికి ఉన్నంత తేడా ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లెలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం సందర్భంగా ఇతర పార్టీల వారు టీడీపీలో చేరదలుచుకుంటే ఆ పార్టీల పరంగా వచ్చిన పదవులన్నింటికీ రాజీనామా చేసిన తర్వాతనే టీడీపీలోకి రావాలని ఆనాడు ఎన్‌టీఆర్ తీర్మానం చేశారన్నారు. నేడు ఇందుకు విరుద్ధంగా చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement