సెలెక్ట్‌ స్టోర్‌ ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్‌ | Payal Rajput in Chittoor Madanapalle | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో సెలెక్ట్‌ స్టోర్‌ ప్రారంభం

Oct 2 2018 11:38 AM | Updated on Oct 2 2018 11:43 AM

Payal Rajput in Chittoor Madanapalle - Sakshi

సెలెక్ట్‌ స్టోర్స్‌ను ప్రారంభిస్తున్న సినీ హీరోయిన్‌ పాయల్‌రాజ్‌పుత్‌

ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ సోమవారం మదనపల్లెలోసందడి చేశారు. పేరెన్నికగన్న సెలెక్ట్‌ మొబైల్‌ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు.

చిత్తూరు, మదనపల్లె సిటీ: ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ సంస్థ సెలెక్ట్‌ మొబైల్స్‌ స్టోర్‌ను స్థానిక సీటీఎం రోడ్డులో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను ఆర్‌ఎక్స్‌–100 మూవీ ఫేం హీరోయిన్‌  పాయల్‌రాజ్‌పుత్‌ సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, సెలెక్ట్‌ స్టోర్స్‌లో అన్ని రకాల మొబైల్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. సెలెక్ట్‌ స్టోర్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ వై.గురు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 200 స్టోర్స్‌ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సంస్థ డైరెక్టర్‌ మురళి మాట్లాడుతూ స్టోర్‌లో కొనుగోలు చేసిన ప్రతి మొబైల్‌పై ఒక ఆకర్షణీయమైన బహుమతి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెలెక్ట్‌ స్టోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement