తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ పరామర్శ | Pawan Kalyan visitation of victims of Hudhud cyclone | Sakshi
Sakshi News home page

తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ పరామర్శ

Oct 15 2014 6:44 PM | Updated on Mar 22 2019 5:33 PM

విశాఖలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ - Sakshi

విశాఖలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిషింగ్ హార్బర్, జాలరిపేటలోని హుదూద్ తుపాను బాధితులను పరామర్శించారు.

విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫిషింగ్ హార్బర్, జాలరిపేటలోని హుదూద్ తుపాను బాధితులను పరామర్శించారు. రాజమండ్రి నుంచి విమానంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఫిషింగ్ హార్బర్, జాలరిపేట వెళ్లి బాధితులను కలుసుకున్నారు. బాధితుల సమస్యలు విని, వారిని పరామర్శించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ '' నేను వస్తే సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. నేను రాకపోతే మీరు బాధపడతారు. అందుకే వచ్చాను'' అని అన్నారు. తుపాను బాధితులకు 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.

పవన్ కల్యాణ్  రేపు ఉదయం విజయనగరంలో పర్యటిస్తారు. ఆ తరువాత శ్రీకాకుళం వెళ్లి అక్కడ బాధితులను పరామర్శిస్తారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement