సీఎం జగన్‌ను అభినందించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Appreciates YS Jagan About Ambulance Services - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌‌ శుక్రవారం అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో అత్యవసర సేవలందించే 108,104 వాహనాలను అత్యాధునిక సౌకర్యాలతో జూలై 1న 1088 అంబులెన్స్‌ సర్వీసులను సీఎం వైఎస్‌ జగన్ ఒకేసారి‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ పవన్‌ ట్విటర్‌లో స్పందించారు. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా అత్యవసర సేవలు అందించే అంబులెన్స్‌లను అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయం. అలాగే గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలోనూ ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా ప్రభుత్వం పనిచేస్తున్న తీరు కూడా అభినందనీయంగా ఉంది.' అంటూ పేర్కొన్నారు.

అలాగే గల్వాన్‌ లోయలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై పవన్‌ ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మోదీని అభినందించారు. ' పీఎం నరేంద్ర మోదీజీ.. నాయకత్వం అనేది దేశస్థులను ఉత్తేజపరిచేది. మన సాయుధ దళాల శౌర్యానికి  ఘనమైన నివాళులు అర్పించారు, ఇవాళ లేహ్‌లో వారితో సంభాషించారు. ఇది మన దళాల మనోధైర్యాన్ని పెంచుతుంది. మీరిచ్చిన ఉత్తేజం వారిలో ఉన్న జోష్‌ను ఆకాశాన్ని తాకేలా చేసింది' అంటూ ట్వీట్‌ చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top