గిట్టుబాటు ధరలతో రైతులకు భద్రత

Parliamentary Standing Committee On Commerce Meeting At Vijayawada - Sakshi

ఏపీ వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి

సాక్షి, విజయవాడ: కనీస గిట్టుబాటు ధరతో రైతులకు భద్రత కలుగుతుందని ఏపీ వ్యవసాయ మిషన్‌ వైఎస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. సోమవారం విజయవాడ గేట్‌ వే హోటల్‌లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ సమావేశం జరిగింది. పార్లమెంటరీ కమిటీ  సభ్యులు, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నామా నాగేశ్వరరావు, కేశినేని నాని తో పాటు మొత్తం 11 మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర, ఎగుమతులపై  చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మీడియాతో ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. వాణిజ్య పంటల్లో పత్తికి మాత్రమే గిట్టుబాటు ధర ఉందని.. మిర్చి, పసుపు పంటకు కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో సమస్య ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఏపీలో పామాయిల్‌ పంట ఎక్కువగా సాగు అవుతోందని..దీనికి కూడా ఎన్‌ఎస్‌పీ రాలేదన్నారు. రాగులు సజ్జలు కు తప్ప మైనర్‌, మేజర్‌ మిల్లెట్లకు ఎన్‌ఎస్‌పీ, గిట్టుబాటు ధర లేవని, వాటికి కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఏపీ నుంచి ఎగుమతి అయ్యే పసుపు, మిర్చి, వరికి ఇన్సెంటివ్స్‌ ఇవ్వాలని కోరామని వెల్లడించారు. ఏపీ రైతుల ఉద్దేశాలను కేంద్రం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించామని చెప్పారు. మిర్చి, పసుపు బోర్డు ఏపీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. రొయ్యలు, చేపల సాగుకు మౌలిక వసతులు కల్పించాలని.. దీని కోసం కేంద్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్‌ ఆక్వాకల్చర్‌ ఇన్‌ ఏపీ కింద స్పెషల్‌ ప్యాకేజీ ఇవ్వాలని కోరామన్నారు. ఏపీలో ఆక్వా రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top