ఫలించిన తోపుదుర్తి కృషి | PABL Pipeline Tap Water Supply Soon in Anantapur | Sakshi
Sakshi News home page

ఫలించిన తోపుదుర్తి కృషి

Feb 7 2020 1:35 PM | Updated on Feb 7 2020 1:35 PM

PABL Pipeline Tap Water Supply Soon in Anantapur - Sakshi

అనంతపురం రూరల్‌: అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని పాపంపేట, విద్యానగర్, ఎంఎన్‌ఆర్‌ కాలనీ, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని నీటి సమస్య తీరనుంది. ఆయా గ్రామాలకు పీఏబీఆర్‌ పైపులైన్‌ ద్వారా   నీటిని అందించడానికి గురువారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ఫలించిన ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి కృషి
గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పీఏబీఆర్‌ పైపులైను ద్వారా అక్కంపల్లి, పాపంపేట, విద్యారణ్య నగర్, కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని పలు కాలనీలకు పీఏబీఆర్‌ ద్వారా నీళ్లను తీసుకొచ్చి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలకు రోజుకు 22 లక్షల లీటర్ల నీరు అందించే విధంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో తమ గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య తీరిందని, ఆయా గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement