టీడీపీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం | P Ravindranath Reddy fire On TDP govt | Sakshi
Sakshi News home page

టీడీపీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం

Aug 12 2018 12:23 PM | Updated on Aug 14 2018 11:24 AM

P Ravindranath Reddy fire On TDP govt - Sakshi

కమలాపురం అర్బన్‌ :  సీఎం చంద్రబాబు పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని.. ఈ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనా«థ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ  కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాలుగున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి ప్రజలను మోసం చేశారన్నారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా టీడీపీ నాయకులు ప్రజల చెంతకు చేరడానికి ప్రయత్నిస్తున్నారే తప్పా ప్రజల నుండి స్పందన లేదన్నారు.

 పోలీసుల వలయంలో గ్రామదర్శిని కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. సీఎం చంద్రబాబు కమీషన్ల పనులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తారని ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలకు మాత్రం సున్న చుడుతారన్నారు. సీఎంకు రాష్ట్ర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదన్నారు.  అర్హులకు పింఛన్లు ఇవ్వడంలో కూడా సీఎంమోసం చేశారన్నారు. రాష్ట్రంలో 108 సేవలను నిర్వీర్యం చేశారన్నారు. 104 వాహనాలు కూడా నామ మాత్రంగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి, సబ్‌ ప్లాన్‌లకు నిధులు కేటాయించడంలో కూడా మోసం చేశారన్నారు.  గ్రామాలలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కేంద్ర నిధులతో పాటు ఎంపీ నిధులు ఉన్నాయన్నారు.  

ఎల్లో మీడియా ద్వారా  అసత్యపు రాతలు, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్పా సీఎం ప్రజలకు చేసింది శూన్యమన్నారు. బాబు పాలన అంతా అవినీతిమయం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, సీ.ఎస్‌.నారాయణరెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, సుమీత్రా రాజశేఖర్‌రెడ్డి, ఎన్‌.సి.పుల్లారెడ్డి, మారుజొళ్ళ శ్రీనివాసరెడ్డి, మునిరెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, మహేశ్వర్‌రెడ్డి, సుదా కొండారెడ్డి, జెట్టి నగేష్, కరిముల్లా, రవిశంకర్, రాయుడు, సుబ్బారెడ్డి, ప్రబాకర్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement