'భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు' | our lands are forcefully acquired, say farmers | Sakshi
Sakshi News home page

'భూములను అన్యాయంగా లాక్కుంటున్నారు'

Feb 23 2015 7:54 PM | Updated on Aug 18 2018 5:48 PM

రైతుల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు అన్నారు.

రైతుల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయంగా లాక్కుంటోందని ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు అన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని అన్నా హజారేకు చెప్పడానికే తాము ఢిల్లీ వచ్చామని తెలిపారు. న్యూఢిల్లీలో అన్నా హజారే చేస్తున్న ఆందోళనలో రైతు, రైతుకూలీల పరిరక్షణ సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.

రాజధానికి 2 వేల ఎకరాల భూమి సరిపోతుందని, అలాంటప్పుడు మిగిలిన భూమిని ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, బినామీల కోసమే రైతుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కాగా, ఏపీ రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను మేధా పాట్కర్ మంగళవారం నాడు జంతర్ మంతర్ వద్ద ప్రారంభిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement