స్కూలు సమీపంలో గ్యాస్‌ లీకేజీ | ongc gas leakage at antarvedi | Sakshi
Sakshi News home page

స్కూలు సమీపంలో గ్యాస్‌ లీకేజీ

May 5 2017 5:56 PM | Updated on Sep 5 2017 10:28 AM

అంతర్వేదిలో ఓఎన్‌జీసీ బావి నుంచి శుక్రవారం సాయంత్రం భారీగా గ్యాస్‌ లీకయింది.

సఖినేటిపల్లి(తూర్పుగోదావరి): సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఓఎన్‌జీసీ బావి నుంచి శుక్రవారం సాయంత్రం భారీగా గ్యాస్‌ లీకయింది. స్థానిక సెయింట్ మేరీస్‌ పబ్లిక్ స్కూలు సమీపంలోని బావి నుంచి పెద్ద ఎత్తున గ్యాస్‌ లీక్‌ కావటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు. నీటితో కూడిన గ్యాస్ లీకేజీని పరిశీలించి అదుపులోకి తీసుకొచ్చారు. పాత పైపులు తుప్పు పట్టి ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement