పాదచారులపైకి దూసుకెళ్లిన జీపు, ఒకరి మృతి | one killed, Police zeep Into the pedestrian | Sakshi
Sakshi News home page

పాదచారులపైకి దూసుకెళ్లిన జీపు, ఒకరి మృతి

Jul 2 2015 5:50 PM | Updated on Aug 21 2018 8:06 PM

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎడ్లగూడెంలో పాదచారులపైకి పోలీసు జీపు దూసుకెళ్లింది.

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎడ్లగూడెంలో పాదచారులపైకి గురువారం పోలీసు జీపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. అయితే పోలీసు జీపు నడిపిన హోంగార్డు రాంబాబు మద్యం సేవించినట్టు తెలిసింది. దాంతో హోంగార్డు రాంబాబుపైనా పోలీసు అధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement