శ్రీవారి సేవలో ఒమర్ అబ్దుల్లా కుటుంబం
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
తిరుమల, న్యూస్‌లైన్: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి సతీమణి పాయల్, కుమారులు జహీర్, జమీర్ ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ డిక్లరేషన్‌పై సంతకం చేసి ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.


