మనువరాలు వయస్సున్న చిన్నారిపై ఓ వృద్ధ కీచకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ : విచక్షణ మరిచిన మనిషి మృగంలా ప్రవర్తించిన ఘటన తిరుమలగిరిలో చోటుచేసుకుంది. మనువరాలు వయస్సున్న చిన్నారిపై ఓ వృద్ధ కీచకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమలగిరి పెద్ద కమేళాలో ఉంటున్న ఓ వృద్దుడు తన ఇంటిపక్కనే ఉంటున్న బాలికపై కన్నేశాడు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిపోయారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించిన కీచకుడు ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అతని మాటలతో షాక్కు గురైన బాలిక 8రోజుల తర్వాత జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించింది. ఆందోళనకు గురైన బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి కార్పెంటర్గా పనిచేస్తున్నాడు.