తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Normal Rush in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Nov 8 2017 7:56 AM | Updated on Nov 8 2017 7:57 AM

తిరుమల : తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. మంగళవారం స్వామి వారిని 65,236 మంది భక్తులు దర్శించుకోగా, 22,034 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement