ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ కేసులు లేవు | No swine flu cases in Andhra pradesh, says kamineni srinivas | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ కేసులు లేవు

Jan 10 2015 9:45 AM | Updated on Aug 18 2018 8:10 PM

ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ కేసులు లేవు - Sakshi

ఆంధ్రప్రదేశ్లో స్వైన్ ఫ్లూ కేసులు లేవు

ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాలేదన్నారు. కాకినాడలో రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయినట్లు వార్తలు వచ్చాయని... రోగుల సాంపిల్స్ తీసి వైద్య పరీక్షలకు పంపినట్లు ఆయన చెప్పారు.

స్వైన్ఫ్లూపై భయాందోళన చెందాల్సిన పని లేదని కామినేని ప్రజలుకు సూచించారు. జిల్లాలో ఎవరికైనా స్వైన్ఫ్లూ వచ్చిందని అనుమానం ఉంటే జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చి.. వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని ఆయన ప్రజలకు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement