'భూమా అరెస్టు ద్వారా గెలవాలనుకోవడం దుర్మార్గం' | narayanaswamy criticised government for arresting MLA | Sakshi
Sakshi News home page

'భూమా అరెస్టు ద్వారా గెలవాలనుకోవడం దుర్మార్గం'

Jul 3 2015 7:03 PM | Updated on Oct 30 2018 4:56 PM

'భూమా అరెస్టు ద్వారా గెలవాలనుకోవడం దుర్మార్గం' - Sakshi

'భూమా అరెస్టు ద్వారా గెలవాలనుకోవడం దుర్మార్గం'

ఆంధ్రప్రదేశ్లో నియంతపాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు.

తిరుపతి : ఆంధ్రప్రదేశ్లో నియంతపాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి ఆరోపించారు. చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్ట్ ద్వారా గెలుపొందాలనుకోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీనే టార్గెట్ చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికుట్రలు పన్నినా వైఎస్ఆర్సీపీ పోరాటాలు ఆపలేరని ఆ పార్టీ ఎమ్మెల్యే నారాయణస్వామి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement