అమ్మ దగ్గరినుంచి అవే నేర్చుకున్నా

Nagari MLA RK Roja Mothers Day Special Interview - Sakshi

సాక్షి, తిరుపతి : తన ఎదుగుదలకు మొదటి కారణం తల్లేనని, ఆమె దగ్గరినుంచి మల్టీటాస్కింగ్‌, డిసిప్లేన్‌ నేర్చుకున్నానని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మదర్స్‌ డే సందర్భంగా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇంట్లోకానీ, బయటకానీ, ఏ టాస్కు ఇచ్చినా అమ్మ సక్సెస్‌ఫుల్‌గా చేసేది. ఏది చేసినా సిస్టమాటిక్‌గా చేయాలనే వారు. ఆమె నేర్పిన అనేక విషయాల వల్లే ఈ రోజు నన్ను మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దాయని అనుకుంటున్నా. ఆమె మమ్మల్ని చాలా బాధ్యతతో పెంచింది. నాకు ఇన్పిరేషన్‌ అమ్మే. నా కోసం వాలెంట్రీ రిటైర్‌మెంట్‌ తీసుకుని నా వెంట చెన్నై వచ్చేసింది. అనుక్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆర్టిస్ట్‌గా నా సక్సెస్‌ను చూసింది. ఈ రోజు తను లేకపోవటం చాలా బాధగా ఉంది.  ( మద్యం అమ్మకాలే ప్రధాన ఆదాయం: రోజా)

మేమందరం సెటిల్‌ అయ్యాం, పిల్లలతో ఉన్నాం, మా పిల్లలతో ఆడుకోవాల్సిన సమయంలో అమ్మలేకపోవటం మా అందరికి తీర్చలేని కొరత. తల్లి రుణం ఎవరూ తీర్చుకోలేనిది. అమ్మను చాలా మిస్‌ అవుతున్నాను. ఆమెను తలుచుకున్నపుడల్లా ఏడుస్తుంటా. మా అమ్మలేని లోటును నా భర్త తీరుస్తున్నారు. నాపై మా అమ్మ చూపిన ప్రేమనే.. నా పిల్లలకు పంచుతున్నా. వాళ్లు అడిగినవి అన్నీ కొనిస్తుంటాను. మా పిల్లలు ప్రస్తుత ట్రెండ్‌కు ఆపోజిట్‌గా ఉన్నారు. వాళ్లకి తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ’’ని అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top