మహిళలకు మరింత స్వాతంత్య్రం కావాలి | Municipal Chairperson Rajya Lakshmi | Sakshi
Sakshi News home page

మహిళలకు మరింత స్వాతంత్య్రం కావాలి

Mar 8 2015 2:53 AM | Updated on Oct 16 2018 6:15 PM

మహిళలకు మరింత స్వేచ్ఛ కావాలని ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్స న్ పి.రాజ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. మున్సిపల్ మాజీ చైర్మన్,

 ఇచ్ఛాపురం:  మహిళలకు మరింత స్వేచ్ఛ కావాలని ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్‌పర్స న్ పి.రాజ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. మున్సిపల్ మాజీ చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకు డు పిలక పోలారావు కోడలైన ఈమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి చైర్‌పర్సన్ గిరీని అధిరోహిం చారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని చెప్పారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో అవకాశం వచ్చిందన్నారు.
 
 మహిళలందరికీ ఇటువంటి అవకాశం దొరక్కపోవచ్చునని అభిప్రాయపడ్డారు. మహిళలకు ఇంకా ఎన్నో అవకాశాలు ఇవ్వా ల్సి ఉందన్నారు. అవకాశ లు ఇస్తే మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవ డం ఖాయమన్నారు. మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్ల శాతం మరింత పెంచాల్సి ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణించడానికి.. వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రత్యేక శిక్షణ ఇవాల్సి ఉందన్నారు. జీవిత భాగస్వాముని ఎన్నుకునే స్వేచ్ఛ కూడా మహిళలకు ఉండాలన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement