‘తండ్రీ, కొడుకులు హాయిగా అక్కడే ఉండండి’ | MP Vijaysaireddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

‘తండ్రీ, కొడుకులు హాయిగా అక్కడే ఉండండి’

Apr 9 2020 11:59 AM | Updated on Apr 9 2020 12:00 PM

MP Vijaysaireddy fires on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : హైదరాబాద్‌లో కూర్చొని డాక్టర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే నీచపు పనులకు తండ్రీ,కొడుకులు ఒడిగడుతున్నారని ఏపీ ప్రతిపక్షనాత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లను ఉద్దేశించి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చెంచాలతో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ వైద్య సేవలందిస్తున్న వారిని భయాందోళనకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మీకీ రాష్ట్రం, ప్రజల పట్ల ఎటువంటి బాధ్యత లేదని, హాయిగా అక్కడే ఉండండి అంటూ ట్విటర్‌లో నిప్పులు చెరిగారు.

 

'గ్రాఫిక్స్ లేవు. గాలి వార్తలు లేవు. పనులు జరుగుతున్నాయి ఇక్కడ. కరోనా నియంత్రణలోనే కాక, టెస్టింగ్, చికిత్స పరికరాల ఉత్పత్తిలో దేశానికే మార్గదర్శకం కాబోతోంది రాష్ట్రం. పది నెలలే అయింది. ఇంకా నాలుగేండ్లలో చాలా వండర్స్ చూడాలి. గుండె దడ రాకుండా చూసుకోవాలి కుల మీడియా, దాని బాసు' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement