మోస్ట్ వాంటెడ్ ‘ఎర్ర’స్మగ్లర్ అరెస్టు | Most Wanted 'rosewood' smuggler arrested | Sakshi
Sakshi News home page

మోస్ట్ వాంటెడ్ ‘ఎర్ర’స్మగ్లర్ అరెస్టు

May 28 2014 1:44 AM | Updated on Sep 2 2017 7:56 AM

మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శేషును మంగళవారం తెల్లవారుజామున స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసినట్టు సమాచారం.

 మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్  శేషును మంగళవారం  రేణిగుంట వద్ద స్పెషల్ టాస్క్‌ఫోర్‌‌స బృందం అరెస్టు చేసింది. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఇతడు వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు.           
 
 రేణిగుంట, న్యూస్‌లైన్: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ శేషును మంగళవారం తెల్లవారుజామున స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసినట్టు సమాచారం. వైఎస్సార్ జిల్లాకు చెందిన శేషు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఎర్రచందనం కేసుల్లో ప్రధాన నిందితుడు. శేషు కదలికలపై నిఘా ఉంచిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రేణిగుంట మండలం ఆంజనేయపురం చెక్‌పోస్టు వద్ద  మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో పథకం ప్రకారం అరెస్టు చేసినట్టు తెలిసింది.
 
 పలు ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న శేషు వద్ద సుమారు  రూ 100 కోట్లకు పైగా అక్రమసంపాదన ఉన్నట్టు సమాచారం. అతనిని అరెస్టు చేసిన వెంటనే జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో పాటు డీఐజీ బాలకృష్ణ రేణిగుంట మండలం మామండూరుకు చేరుకున్నట్టు తెలిసింది. రహస్య స్థావరంలో శేషును విచారిస్తున్నట్టు సమాచారం. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో శేషుకు సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.వారాలుగా మామండూరు, శేషాచల అడవుల్లో ఆపరేషన్ నిర్వహించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందం ఈ స్మగ్లర్‌ను అరెస్టు చేయడంలో విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement