లష్కర్-ఎ-తయిబా కీలక ఉగ్రవాది దారుణ హత్య | Most wanted Lashkar e Taiba terrorist Mohammad Bilal Arif Salafi stabbed to death | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది దారుణ హత్య

Mar 21 2026 11:26 PM | Updated on Mar 21 2026 11:26 PM

Most wanted Lashkar e Taiba terrorist Mohammad Bilal Arif Salafi stabbed to death

పాకిస్తాన్‌లోని లష్కర్-ఎ-తయిబా (LeT) ప్రధాన కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది. భారత్‌లో అనేక ఉగ్రదాడుల్లో నేరుగా ప్రమేయం ఉన్న LeT మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ మొహమ్మద్ బిలాల్ అరీఫ్ సలఫీని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొలుత కాల్పులు జరిపి, ఆతర్వాత కత్తులతో పొడిచి హతమార్చారు. సలఫీ.. మసీదులో నమాజ్‌ పూర్తి చేసుకొని బయటికి రాగానే దుండగులు అటాక్‌ చేశారు.

సలఫీ LeTలో కీలక నేత అని, భారత్‌లో అనేక దాడుల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ హత్య LeTలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది. కాగా, లష్కర్-ఎ-తయిబా పాకిస్తాన్‌లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రమూక భారత్‌లో అనేక దాడులకు పాల్పడింది. 2008 ముంబై దాడులు సహా అనేక రక్తపాతాల్లో LeT పాత్ర నిరూపితమైంది.

 

Advertisement
 
Advertisement
Advertisement