వర్షం కురిసే..పొలం పిలిచే..

Monsoons Effect Farmers are Working on the Farm for Harvesting - Sakshi

సాక్షి, కర్నూలు : కొంత కాలంగా అలకబూనిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. రైతులు పంట సాగుకు పొలం బాట పడుతున్నారు. మూడు రోజుల నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు, గూడూరు, బెళగల్, కోడుమూరు మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. ఈఏడాది నియోజకవర్గంలో ఎక్కువగా పత్తి, వేరుశనగ, కందులు, ఉల్లి, శనగ, మొక్కజొన్న, పంటలను సాగు చేస్తున్నారు.

నకిలీ విత్తనాలతో బెంబేలు .. 
పంటలు సాగు చేసుకోవడానికి అవపసరమైన విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని కంపెనీ యజమానులు ఆసరా చేసుకుని నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. గతంలో ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా అలాంటి విత్తనాలు    అమ్మి రైతన్నలను మోసం చేశారు.  ఈ ఏడాది మళ్లీ అలాంటి మోసం జరగకుండా  వ్యవసాయ అధికారులు చర్యలు చేపటాలని పలువురు రైతులు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top