దాడి కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి | MLA surrenders in case of attack | Sakshi
Sakshi News home page

దాడి కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

Dec 3 2015 12:57 PM | Updated on Aug 13 2018 4:11 PM

రేణిగుంట ఎయిర్‌పోర్టు అధికారిపై దాడి ఆరోపణల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.

రేణిగుంట ఎయిర్‌పోర్టు అధికారిపై దాడి ఆరోపణల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడిని విడిచి పెట్టాలని ఆందోళన నిర్వహించారు.


కాగా.. నవంబర్ 26న ఓ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్టు అధికారితో ప్రోటో కాల్ విషయమై... ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ కేసులో చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు.., ఎంపీ మిధున్ రెడ్డి, మరో 15 మంది పై ఎయిర్ పోర్టు అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement