breaking news
Chavireddy Bhaskar Reddy
-
దాడి కేసులో లొంగిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
రేణిగుంట ఎయిర్పోర్టు అధికారిపై దాడి ఆరోపణల్లో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. దీంతో పోలీసులు ఈ కేసు విచారణ మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడిని విడిచి పెట్టాలని ఆందోళన నిర్వహించారు. కాగా.. నవంబర్ 26న ఓ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్టు అధికారితో ప్రోటో కాల్ విషయమై... ఎమ్మల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ కేసులో చంద్రగిరి ఎమ్మెల్యేతో పాటు.., ఎంపీ మిధున్ రెడ్డి, మరో 15 మంది పై ఎయిర్ పోర్టు అధికారులు ఫిర్యాదు చేశారు. -
సంప్రదాయాలను సీఎం మంటగలుపుతున్నారు
హిందువుల ఆచారాలు, సంప్రదాయాలను సీఎం చంద్రబాబునాయుడు మంటగలుపుతున్నాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయి.. అంటు వీడక ముందే పూజలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. నారావారిపల్లెలో టీటీడీ కళ్యాణ మండపంలో ఇతర మతస్థులు ప్రార్థనలు చేయడం దారుణమని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం వ్యవహార శైలిని పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.