పింఛన్ల పునరుద్ధరణ కోరుతూ ఎమ్మెల్యే దీక్ష | MLA seeking the restoration of pensions strike | Sakshi
Sakshi News home page

పింఛన్ల పునరుద్ధరణ కోరుతూ ఎమ్మెల్యే దీక్ష

Mar 6 2015 2:19 AM | Updated on Sep 2 2017 10:21 PM

చిత్తూరు జిల్లాలోని ఐరాల మండల వ్యాప్తంగా తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వైఎస్సార్‌సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఐరాల: చిత్తూరు జిల్లాలోని ఐరాల మండల వ్యాప్తంగా తొలగించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం వైఎస్సార్‌సీపీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కమిటీల నిర్ణయం మేరకు తొలగించిన పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరాహారదీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు మద్దతు తెలిపి ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు.  పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement