మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం | Minor girl raped by minor boy in visakhapatnam district | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం

Jan 12 2014 1:19 PM | Updated on May 3 2018 3:17 PM

మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం - Sakshi

మైనర్ బాలికపై బాలుడు అత్యాచారం

విశాఖపట్నం జిల్లా భీమిలి ఎగువపేటలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది.

విశాఖపట్నం జిల్లా భీమిలి ఎగువపేటలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఏడు ఏళ్ల బాలికపై 15 ఏళ్ల అమ్మోరు అనే బాలుడు అత్యాచారం చేశాడు.  కిరాణా షాపుకు తీసుకువెళ్తానని ఆ బాలికను అమ్మోరు చెప్పాడు. అనంతరం ఊరి చివరి పోదల్లో ఆ బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. బాలిక ఇంటికి చేరుకుని తల్లి తండ్రులకు జరిగిన సంగతిని వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

పరారిలో ఉన్న నిందితుడు అమ్మోరును పట్టుకునేందుకు పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అమ్మోరు తల్లితండ్రులను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. అయితే అమ్మోరు సంగతి తమకు తెలియదని పోలీసులకు వారు వెల్లడించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement