కైలాసగిరిపై స్వల్ప అగ్నిప్రమాదం | minor fire accident in vizag | Sakshi
Sakshi News home page

కైలాసగిరిపై స్వల్ప అగ్నిప్రమాదం

Apr 21 2015 5:37 PM | Updated on Sep 5 2018 9:45 PM

విశాఖ నగరం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై మంగళవారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది

విశాఖపట్నం : విశాఖ నగరం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కైలాసగిరిపై మంగళవారం మధ్యాహ్నం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెత్తాచెదారం అంటుకోవటంతో ఆ మంటలు ఎండిన చెట్లకు వ్యాపించాయి.

వేడిగాలులు తోడు కావటంతో మంటల తీవ్రత పెరుగుతుందేమోనని స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కాగా అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోగా పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement