గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదు | Minister Shankar Narayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదు

Aug 3 2019 7:01 PM | Updated on Aug 3 2019 7:07 PM

Minister Shankar Narayana Comments On Chandrababu - Sakshi

(ఫైల్‌)

సాక్షి, అమరావతి : గ్రామ వాలెంటరీ వ్యవస్థలో అవినీతికి తావు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గ్రామ వాలెంటరీలుగా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. జన్మభూమి కమిటీలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవస్థను  భ్రష్టు పట్టించారని విమర్శించారు. అవినీతి, అక్రమాలతో చంద్రబాబు పాలన కొనసాగిందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement