అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
అనంతపురం : అనంతపురం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగు నీరు అందిస్తామని చెప్పారు. త్వరలో సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు.
జీవన్‌ధార ఔషధ దుకాణాలను 'అన్న సంజీవని' పేరుతో మార్చి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 120 జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలో కరువు, వైద్య పరిస్థితులపై ఈ నెల 27, 28వ తేదీల్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు.