చంద్రబాబు రాజకీయ సన్యాసం : మంత్రి జోస్యం

Minister Gummanuru Jayaram Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, కర్నూలు : కరోనా లాంటి విపత్కర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ ఉంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం విమర్శించారు. ఐదు కోట్ల ప్రజలను గాలికి వదిలేసి హైదరాబాద్‌లో కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. దీని బట్టి చూస్తే చంద్రబాబు ఇక రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కరోనా కష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా.. టీడీపీ నాయకులు కేవలం పత్రికా ప్రకటనకే పరిమితమైయ్యారని అన్నారు. కరోనా సోకుంతుందన్న భయంతో చంద్రబాబు, లోకేష్ ఇంటికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోందని, రాబోయే ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకే పరిమితమవుతుందని మంత్రి జయరాం జోస్యం చెప్పారు. (కరోనా: ఏపీలో మరో 58 పాజిటివ్‌ కేసులు)

ఆదివారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘కోట్ల సుజాతమ్మకు మా ప్రభుత్వాన్ని, మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. వలస కూలీల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక శాఖ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటుంటే విమర్శలు చేయడం సరైనది కాదు. ఫ్యాక్షన్ రాజకీయంతో ఎంతో మంది ఆడపడుచులను వితంతువులగా మార్చిన ఘనత కోట్ల కుటుంబానికే దక్కుతుంది. ఆలూరు ప్రజలు రెండు సార్లు ఓడించిన మీకు బుద్ధి రాలేదు. మరో సారి కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు దేశంలో కరోనా పరీక్షలు అత్యధికంగా నిలిచిన రాష్ట్రం మనదే అని మంత్రి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ కట్టడికి సీఎం జగన్‌ అన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. (కార్మికుల‌ను ఆదుకుంటాం : మ‌ంత్రి జ‌య‌రాం)

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top