కార్మికుల‌ను ఆదుకుంటాం : మ‌ంత్రి జ‌య‌రాం | Labour Minister Gummanur Jayaram May Day Wishes To Workers | Sakshi
Sakshi News home page

కార్మికుల‌ను ఆదుకుంటాం : మ‌ంత్రి జ‌య‌రాం

May 1 2020 12:40 PM | Updated on May 1 2020 1:15 PM

Labour Minister Gummanur Jayaram May Day  Wishes To Workers - Sakshi

సాక్షి, క‌ర్నూలు :  రాష్ర్ట కార్మికులంద‌రికీ కార్మిక శాఖ మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం 'మే' డే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా లాక్‌డౌన్ త‌ర్వాత భ‌వ‌న నిర్మాన కార్మికుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం 'మే' డే సంద‌ర్భంగా కార్మికుల క‌ష్టాన్ని గుర్తించి శ్ర‌మ‌ శ‌క్తి అవార్డులు ఇవ్వ‌డం ఆన‌వాయితీ అని, ఈసారి క‌రోనా కారణంగా ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కార్మిక ప‌క్ష‌పాతి అని, 2019-20 సంవ‌త్స‌రానికి గానూ అసంఘ‌టిత కార్మికుల సంక్షేమం కోసం  494 కోట్లు రూపాయిలు నిధులు విడుదల చేసిన‌ట్లు పేర్కొన్నారు. రాష్ర్టంలో కార్మికులకు వైఎస్సార్ బీమా అమ‌లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement