టీడీపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు.. | Minister Botsa Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

జగన్‌ మంచి చేస్తుంటే.. టీడీపీ కుట్రలు చేస్తోంది..

Jul 6 2020 12:00 PM | Updated on Jul 6 2020 3:23 PM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: పేదలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి చేస్తుంటే ప్రతిపక్షం కుట్ర చేస్తోందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘మొదట 25 లక్షలు అనుకున్నాం, 30 లక్షలు పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారు. భూములు స్వచ్చందంగా ఇచ్చారు. భూ సేకరణ ద్వారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుంది. కోర్టులు నుంచి స్టే  తీసుకు వచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని’’ మంత్రి బొత్స ధ్వజమెత్తారు. టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలను గమనిస్తున్నారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేదని మండిపడ్డారు. (‘మాట వినకుంటే ఇళ్లు ముట్టడిస్తాం’)

తండ్రి స్ఫూర్తితో..
నాడు దివంగత మహానేత వైఎస్సార్‌ ప్రతి పేదవారికి ఇళ్లను అందిస్తే.. అదే స్ఫూర్తితో నేడు ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌ పేదలకు ఇళ్ల స్థలాలను అందించేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. ఈ రోజు  పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలు ఆలస్యం కావచ్చేమో గానీ ఇవ్వడం మాత్రం పక్కా అని మంత్రి బొత్స స్పష్టం చేశారు.  

నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు..
విజయవాడ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు బొత్స తెలిపారు. నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని పేర్కొన్నారు. సింగ్‌నగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్‌ పార్క్‌ అభివృద్ధికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. ఏడాది లోపు పూర్తి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement