దళితుల సొమ్మును దోచుకుంటున్నారు : మేరుగ | Meruga Nagarjuna fires on Chandrababu | Sakshi
Sakshi News home page

దళితుల సొమ్మును దోచుకుంటున్నారు : మేరుగ

Feb 1 2019 3:57 PM | Updated on Feb 1 2019 5:26 PM

Meruga Nagarjuna fires on Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దళిత సంక్షేమానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగర్జున మండిపడ్డారు. దళితుల సొమ్మును చంద్రబాబు పూర్తిగాదోచుకుంటున్నారని నిప్పులు చెరిగారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. 'మా పార్టీ దళితులకు, పేదలకు ఆసరాగా ఉంటుంది. దళితులుగా ఎవరు పుడతారు అన్న సీఎంకి పాలించే అర్హత ఉందా? సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. 

దళితుల పాఠశాలలు, హాస్టళ్లు మూసేస్తే మా పిల్లలు ఎక్కడ చదవాలి? ఎక్కడ ఉండాలి? దళిత ఉద్యోగులు భయపడుతూ బతుకుతున్నారు. దళితుల భూములు లాక్కుంటున్నారు. దళితులకి నిలువ నీడ లేకుండా చేసిన చరిత్ర చంద్రబాబుది. ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ఒక దొంగ, కార్పొరేషన్ నిధులు కోట్లు దోచుకుతిన్నాడు. దళితులంతా ఏకమై ప్రతి ఊరు వెళ్లి చంద్రబాబుని తరిమి కొడదాము. చంద్రబాబు అంతం దళితుల పంతం' అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement