గుంటూరు జిల్లాలో భారీ చోరీ | Massive theft in guntur district | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లాలో భారీ చోరీ

Oct 25 2015 5:11 PM | Updated on Oct 1 2018 6:33 PM

పండుగ సెలవులకు ఊరు వెళ్లి వచ్చేసరికి భారీగా సొత్తు అపహరణకు గురైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

రేపల్లె: పండుగ సెలవులకు ఊరు వెళ్లి వచ్చేసరికి భారీగా సొత్తు అపహరణకు గురైన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల సమాచారం ప్రకారం 40 సవర్ల బంగారం, 10 కిలోల వెండి అపహరణకు గురైందని తెలుస్తోంది.

రేపల్లె మండలం సింగుపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇంటికి తాళం వేసి పండుగ కోసం హైదరాబాద్ వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చిన వారికి ఇంట్లో ఉన్న బంగారం, వెండి కనపడక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement