పరంజా పైనుంచి పడి తాపీ మేస్త్రి మృతి | Masonry were slightly died | Sakshi
Sakshi News home page

పరంజా పైనుంచి పడి తాపీ మేస్త్రి మృతి

Jan 25 2016 12:51 AM | Updated on Sep 3 2017 4:15 PM

స్థానిక పాతూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం 20 అడుగుల ఎత్తు పరంజా పైనుంచి

 తాడేపల్లిగూడెం(తాలూకా ఆఫీస్ సెంటర్) : స్థానిక పాతూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం 20 అడుగుల ఎత్తు పరంజా పైనుంచి భవన నిర్మాణ కార్మికుడు పడటంతో అక్కడిక్కకడే మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి..  స్థానిక డీఎస్ చెరువు ప్రాంత నివాసి పంజా వెంకట్రావు (46) తాపీ మేస్త్రి. పాతూరులోని కోడేవారి వీధిలో ఓ భవన నిర్మాణంలో అతను పని చేస్తున్నాడు.  
 
 రోడ్డు వైపు భవనం గోడ నిర్మాణానికిగాను పరంజ ఏర్పాటు చేశారు. భవనం పక్క నుంచి విద్యుత్ తీగలు వెళుతున్నాయి. ఈ విద్యుత్ వైర్లు తగలకుండాను, పైన  ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు సున్నం రోడ్డుపై పడకుండాను భారీ బరకం ఏర్పాటు చేశారు.    పరంజాపై ఉన్న వెంకట్రావు భవనంపై ఉన్న బరకాన్ని లాగుతుండగా జారి రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకట్రావుకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఎస్సై సూర్యభగవాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement