కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
నందవరం (కర్నూలు) : కడుపునొప్పి భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహరివి గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన హరిజన ప్రభావతి(20)కి నాలుగు నెలల కిందట సుందర్‌రాజు(25)తో వివాహమైంది.
ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న ప్రభావతి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.