కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పలకూరు గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
బనగానపల్లి (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పలకూరు గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలో వ్యాపారం చేసి జీవిస్తున్న రవి భార్య హరిత(30) ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవలతోపాటు కుటుంబ కలహాల వల్ల జీవితంపై విరక్తి చెందిన హరిత ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు.