చికిత్స పొందుతూ వివాహిత మృతి | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వివాహిత మృతి

Sep 19 2015 5:46 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఆడపడుచుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.

నందవరం : ఆడపడుచుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన సారమ్మ(19) నందవరంకు చెందిన రాముడు అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఆడపడుచుల వేధింపులతో విసిగిపోయిన సారమ్మ ఈ నెల 12న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మధ్యాహ్నం మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement