వివాహిత ఆత్మహత్యాయత్నం | Married Woman attempts Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Aug 4 2015 2:45 PM | Updated on Sep 3 2017 6:46 AM

భర్త వేధింపులు తాళలేక భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

ఆదోని (కర్నూలు జిల్లా) : భర్త వేధింపులు తాళలేక భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మంగళవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో జరిగింది. వివరాల ప్రకారం...  హనుమాన్‌నగర్‌కు చెందిన రంగమ్మ(45)ను హమాలీగా పని చేసే ఆమె భర్త తాయన్న రోజూ కొట్టేవాడు. తాయన్న తను సంపాదించిన డబ్బును పూర్తిగా తాగి తన భార్య సంపాదన కూడా ఇవ్వాలని నిత్యం వేధించేవాడు.

కాగా ఈ క్రమంలోనే భర్త వేధింపులను తాళలేకపోయిన రంగమ్మ మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలిసిన స్థానికులు రంగమ్మను ఆస్పత్రికి తరలించారు. 80శాతం కాలిన గాయాలతో రంగమ్మ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement