'జీవో 97 ఉపసంహరణ చంద్రబాబు కుట్ర' | Maoists sen letter to media | Sakshi
Sakshi News home page

'జీవో 97 ఉపసంహరణ చంద్రబాబు కుట్ర'

Dec 11 2015 6:39 PM | Updated on Oct 9 2018 2:51 PM

విశాఖ మన్యంలోని ఆదివాసీ గిరిజనుల ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకే జీవో97ను ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాటకం ఆడుతున్నారని మావోయిస్టులు ఆరోపించారు.

సీలేరు (విశాఖ) : విశాఖ మన్యంలోని ఆదివాసీ గిరిజనుల ఆగ్రహంపై నీళ్లు చల్లేందుకే జీవో97ను ఉపసంహరించుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాటకం ఆడుతున్నారని మావోయిస్టులు ఆరోపించారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి చంద్రమౌళి పేరుతో శుక్రవారం మీడియాకు ఒక లేఖ అందింది. పోలీసులను ఆదివాసీలపై ఉసిగొల్పేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. స్పెషల్ ప్యాకేజీల పేరుతో ఆదివాసీలను చీల్చి, ఒక వర్గం వారిని తమ వైపు లాక్కునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆ లేఖలో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement