భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య | man suicide in ananthpur distirict | Sakshi
Sakshi News home page

భార్య పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య

Aug 24 2015 11:43 AM | Updated on Aug 29 2018 8:38 PM

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కల్యాణదుర్గం: కుటుంబకలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగన్న(40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, గత కొంతకాలంగా కుటుంబకలహాల నేపథ్యంలో లింగన్న భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపం చెందిన లింగన్న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement