ఆటో-బైక్ ఢీ.. యువకుడి మృతి | Man killed in auto - bike collided | Sakshi
Sakshi News home page

ఆటో-బైక్ ఢీ.. యువకుడి మృతి

Feb 3 2016 12:01 PM | Updated on Aug 30 2018 3:58 PM

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని నక్కలపేటకు చెందిన గుత్తా వినయ్(26) పరిటాల నుంచి కంచకచర్ల వైపు బైక్ పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో వినయ్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని 108 సాయంతో ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement