ఇసుక లారీ ఢీకొనియువకుడి మృతి | Man killed by sand lorry collides | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ ఢీకొనియువకుడి మృతి

Nov 5 2013 1:46 AM | Updated on Aug 29 2018 8:36 PM

మండలంలోని భీమారంలో ప్రభుత్వ వసతి గృహం వద్ద సోమవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీ మారం గ్రామానికి చెందిన తువ్వ మల్లేశ్(23) మృతి చెందగా మారం దేవేందర్‌కు గాయాలైనట్లు ఎసై్స శ్రీలత తెలిపారు.

జైపూర్, న్యూస్‌లైన్ : మండలంలోని భీమారంలో ప్రభుత్వ వసతి గృహం వద్ద సోమవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీ మారం గ్రామానికి చెందిన తువ్వ మల్లేశ్(23) మృతి చెందగా మారం దేవేందర్‌కు గాయాలైనట్లు ఎసై్స శ్రీలత తెలిపారు. ఆమె కథనం ప్రకా రం.. భీమారం గ్రామానికి చెందిన మారం దేవేందర్, తువ్వ మల్లేశ్ ప నుల నిమిత్తం బైక్‌పై చెన్నూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మంచిర్యాల వైపు నుంచి వచ్చిన ఇసుక లారీ బైక్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో దేవేందర్ స్వల్పంగా గాయపడగా మల్లేశ్ తీ వ్రంగా గాయపడ్డాడు. వీరిని మంచి ర్యాల ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌ను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ గొల్లపెల్లి ఓదెలుపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నామని ఎసై్స తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement