తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి... | Man killed by lorry in antapur district | Sakshi
Sakshi News home page

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి...

Feb 6 2015 10:59 AM | Updated on Aug 29 2018 8:36 PM

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి... - Sakshi

తేనెటీగల దాడి నుంచి తప్పించుకోబోయి...

తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు.

అనంతపురం: తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ యువకుడు మినీ లారీ కింద పడి మరణించాడు. ఆ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ సమీపంలోని రహదారిపై చోటు చేసుకుంది. నారాయణరెడ్డిపల్లెకు చెందిన జయచంద్ర కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే శుక్రవారం ఉదయం ఎల్లుట్ల - మడ్డిపల్లి రోడ్డు సమీపంలో ట్రాక్టర్లో రాళ్లు నింపడానికి వెళ్లాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తేనెతుట్టే కదిలి...జయచంద్రపై  దాడీ చేశాయి. దాంతో పారిపోయే క్రమంలో రోడ్డుపైకి వేగంగా పరిగెత్తాడు. అంతలో వేగంగా వస్తున్న మీని లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement