రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | man died in road accident at nellore distirict | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sep 1 2015 10:04 AM | Updated on Aug 30 2018 3:56 PM

బైక్‌పై వేగంగా వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై అడ్డంగా వచ్చిన గేదేను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిఅక్కడికక్కడే మృతి చెందాడు.

చిల్లకూరు: బైక్‌పై వేగంగా వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై అడ్డంగా వచ్చిన గేదేను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిఅక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు..మండలంలోని అంకుల్‌పాటూరులో ఉన్న ఎస్‌బీక్యూ ఉక్కు పరిశ్రమలో గోవర్ధన్‌రెడ్డి(36) అనే వ్యక్తి పని చేస్తున్నాడు.

కాగా, మంగళవారం విధుల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా మార్గ మధ్యలో గేదే అడ్డురావడంతో ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement