వాహనం ఢీకొని యువకుడి మృతి | man died in road accident | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని యువకుడి మృతి

Feb 19 2015 4:35 PM | Updated on Oct 30 2018 7:25 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అమర్‌నాథ్ రెడ్డి(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

కడప: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అమర్‌నాథ్ రెడ్డి(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని బ్రాహ్మణీ ఉక్కు కర్మాగారం సమీపంలో గురువారం చోటు చేసుకుంది.  అమర్‌నాథ్ రెడ్డి తన స్వగ్రామం ముద్దునూరు నుంచి జమ్మలమడుగుకు కోర్టు పనుల కోసం ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేస దర్యాప్తు ప్రారంభించారు.
(జమ్మలమడుగు)

Advertisement
 
Advertisement
Advertisement